

అమెరికాలోని వెర్మాంట్ రాష్ట్రానికి చెందిన కేట్లిన్ అబ్రామ్స్ అనే యువతి అందరినీ ఆశ్చర్యపరిచే పనితో వార్తల్లో నిలిచింది. పాడుబడిన శ్మశానాన్ని తన రెండో ఇల్లుగా మార్చుకున్న ఆమె, అక్కడి వందల ఏళ్ల నాటి సమాధులను శుభ్రం చేస్తూ వాటికి కొత్త రూపాన్ని తీసుకొస్తోంది. నిర్లక్ష్యానికి గురైన సమాధుల వద్ద ఎక్కువ సమయం గడుపుతూ, వాటిపై పేరుకుపోయిన మట్టి, ధూళిని తొలగించి పాత సమాధుల పరిరక్షణకు కృషి చేస్తోంది.
సమాధులను శుభ్రం చేయడంతో పాటు వాటిలో సమాధి చేసిన వ్యక్తుల గురించి, వారి జీవిత విశేషాల గురించి కేట్లిన్ పరిశోధిస్తోంది. ఈ క్రమంలో తెలుసుకున్న ఆసక్తికరమైన చారిత్రక విషయాలను సోషల్ మీడియాలో పంచుకుంటోంది. ఆమె చేసే ప్రత్యేకమైన పనులు, వెల్లడించే చారిత్రక విశేషాలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. దీంతో సోషల్ మీడియాలో ఆమెకు దాదాపు 30 లక్షల మంది అభిమానులు ఏర్పడ్డారు. మరుగునపడిన చరిత్రను వెలుగులోకి తీసుకురావడంతో పాటు పురాతన సమాధుల పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!