
రాజకీయాలు

మెక్సికోలో కార్టెల్ నేత అరెస్టు తర్వాత హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ‘ఎల్ చాపో ఇసిడ్రో’గా పేరొందిన కార్టెల్ నాయకుడు మెజా ఫ్లోరెస్‌ను అరెస్టు చేసిన అనంతరం పలు ప్రాంతాల్లో కాల్పులు జరిగాయి. ఈ ఘటనల్లో మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఏడుగురు కార్టెల్‌కు చెందిన సాయుధులు కాగా, మరో నలుగురు సైనికులు ఉన్నారు.
మెజా ఫ్లోరెస్‌తో పాటు మరో ఏడుగురిని అధికారులు అరెస్టు చేశారు. అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) మోస్ట్ వాంటెడ్ జాబితాలో టాప్-10లో ఉన్న మెజా ఫ్లోరెస్ అరెస్టు మెక్సికోలో ఉద్రిక్తతలకు దారితీసింది. అరెస్టు అనంతరం చెలరేగిన హింసతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!