

వరంగల్‌లో కొత్తగా నిర్మిస్తున్న మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలోని అన్ని విభాగాల్లో ఔట్‌పేషెంట్ సేవలను వెంటనే ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అవసరమైన చర్యలు చేపట్టి ఓపీ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎన్. శ్రీధర్, ప్రత్యేక ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్ అధికారులను ఆదేశించారు.
శుక్రవారం వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని సీఎంవో అధికారులు సందర్శించి నిర్మాణ పనులను పరిశీలించారు. ఆస్పత్రిలో విద్యుత్ సరఫరా, నీటి వసతి, ఇతర ప్రాథమిక సౌకర్యాలపై సమీక్షించారు. అనంతరం సీఎంవో కార్యదర్శి కె. మాణిక్య రాజ్, ప్రణాళికా, ఆర్థిక శాఖ కార్యదర్శి డాక్టర్ గౌరవ్ ఉప్పల్‌తో వివిధ అంశాలపై చర్చించారు. నవంబర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ఈ ఆస్పత్రిని ప్రారంభించే అవకాశం ఉందని సీఎంవో అధికారులు వెల్లడించారు. అక్టోబర్‌లోగా 18 అంతస్తులను సిద్ధం చేయాలని, నిర్మాణ పనులను ప్రతిరోజూ పర్యవేక్షించాలని వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. సమీక్ష సమావేశంలో ఎంజీఎం, ప్రభుత్వ సీకేఎం ప్రసూతి ఆస్పత్రి, హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి, వరంగల్ ప్రాంతీయ కంటి ఆస్పత్రి సూపరింటెండెంట్లు, కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ పాల్గొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!