

స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీలకు 34 శాతం కంటే ఎక్కువ రిజర్వేషన్లు కల్పించి వారిని గెలిపించుకుంటామని అన్నారు. వెనుకబడిన వర్గాలకు అండగా నిలవడం తెలుగుదేశం పార్టీ విధానమని పేర్కొన్నారు. గత ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించడం వల్ల స్థానిక సంస్థల్లో 16,800 మంది నాయకత్వ అవకాశాలు కోల్పోయారని ఆరోపించారు. గత ఎన్నికల్లో రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చామని, అయితే వైసీపీ న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఆ ప్రక్రియకు అడ్డంకులు సృష్టించిందని విమర్శించారు.
వైసీపీ హయాంలో బీసీ కమిషన్ కూడా ఏర్పాటు చేయలేదని చంద్రబాబు ఆరోపించారు. గత ఎన్నికల్లో ఎన్డీఏకు 57 శాతం ఓట్లు రావడంలో బీసీల మద్దతు కీలకమని పేర్కొన్నారు. ఓటర్ల జాబితా ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎన్నికలకు వెళ్లకూడదన్న వాదనపైనా ఆయన విమర్శలు చేశారు. తాను గతంలో కంటే మరింత దృఢంగా ముందుకు సాగుతానని చెబుతూ, అడ్డంకులను అధిగమించి ముందుకెళ్తామని వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించి, ప్రభుత్వ కార్యక్రమాలను మరింత వేగంగా అమలు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!