

ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ‘అవతార్’ ఫ్రాంచైజీ నుంచి మరో ఆసక్తికరమైన అప్‌డేట్ వచ్చింది. నాలుగో భాగం నిర్మాణం ముందుకు సాగుతోందని డిస్నీ అధికారికంగా వెల్లడించింది. దర్శకుడు జేమ్స్ కామెరూన్ ఈ సిరీస్‌లో కొనసాగడంపై గతంలో కొన్ని సందేహాలు వ్యక్తమైనప్పటికీ, తాజాగా విడుదల చేసిన సినిమాల జాబితాలో ‘అవతార్ 4’కు చోటు కల్పించడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో ఈ ప్రాజెక్ట్ విషయంలో నిర్మాణ సంస్థకు ఉన్న నమ్మకం మరోసారి స్పష్టమైంది. ఇప్పటికే చిత్రానికి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ కూడా పూర్తయినట్లు సమాచారం.
ముఖ్యంగా సల్లీ కుటుంబానికి చెందిన చిన్న వయసు పాత్రల సన్నివేశాలను గత చిత్రాల షూటింగ్ సమయంలోనే కొన్నేళ్ల క్రితం చిత్రీకరించారు. దీంతో తదుపరి భాగాల నిర్మాణానికి ముందుగానే కొన్ని పనులు పూర్తిచేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నాలుగో భాగానికి సంబంధించిన ప్రణాళికలు కొనసాగుతున్నాయి. డిస్నీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ‘అవతార్ 4’ను 2029 డిసెంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఇక ఈ ఫ్రాంచైజీలో ఐదో భాగమైన ‘అవతార్ 5’ను 2031 డిసెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించారు. ఈ రెండు చిత్రాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!