

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ సినిమా విడుదల తేదీపై ఇంకా అధికారిక స్పష్టత రాలేదు. దసరా సందర్భంగా చిత్రాన్ని విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ, ఇప్పటివరకు రిలీజ్ డేట్‌ను ప్రకటించలేదు. ఇదిలా ఉండగా, చిరంజీవి తాజాగా మళ్లీ ‘విశ్వంభర’ షూటింగ్‌లో పాల్గొన్నట్లు సమాచారం. సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను రీషూట్ చేయాల్సి రావడంతో ఆయన నాలుగు రోజుల సమయాన్ని కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌లో పెండింగ్‌లో ఉన్న రీషూట్ భాగాలను పూర్తి చేయాలని చిత్రబృందం భావిస్తోంది.
మరోవైపు భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ పోస్ట్ ప్రొడక్షన్, విఎఫ్‌ఎక్స్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. నిర్మాణ వ్యయాన్ని త్వరగా రాబట్టుకునేందుకు నాన్-థియేట్రికల్ హక్కుల ఒప్పందాలను పూర్తి చేసే ప్రయత్నాల్లో నిర్మాతలు ఉన్నట్లు సమాచారం. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. చిరంజీవి సరసన త్రిష కథానాయికగా నటిస్తుండగా, ఎం.ఎం. కీరవాణి పాటలు అందిస్తున్నారు. హరి గౌర నేపథ్య సంగీతం సమకూరుస్తున్నారు. సినిమా విడుదల తేదీపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!