

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’ చిత్రంపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ అధినేత రవిశంకర్ స్పష్టం చేశారు. సినిమా గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో ప్రభాస్‌ను ఇప్పటివరకు చూడని విధంగా చూపించామని, సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు ఆశ్చర్యపోతారని రవిశంకర్ చెప్పినట్లు సమాచారం.
హను రాఘవపూడి ప్రత్యేకమైన కథనంతో పాటు ప్రభాస్‌కు భిన్నమైన రూపాన్ని, పాత్రను చూపించబోతున్నారని నిర్మాత వ్యాఖ్యల ద్వారా తెలుస్తోంది. దీంతో అభిమానులు సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో ఇమాన్వి కథానాయికగా నటిస్తుండగా, పీరియాడిక్ నేపథ్యానికి తగ్గట్టుగా కథ, విజువల్స్, పాత్రల రూపకల్పన ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభాస్ లుక్‌పై వచ్చిన అంచనాలు అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచాయి. డిసెంబర్ 3న ‘ఫౌజీ’ ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పుడు హను రాఘవపూడి, ప్రభాస్ కలయిక ఎలాంటి అనుభూతిని అందిస్తుందో చూడాలి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!