

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు బాబీ ఇచ్చిన ‘కాకా’ ట్రీట్ అభిమానులను ఆకట్టుకుంది. అయితే తాము విడుదల చేసిన కంటెంట్ అసలు సినిమా స్థాయికి కేవలం శాంపిల్ మాత్రమేనని బాబీ చెప్పినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా థమన్ అందించబోయే సంగీతం రాబోయే రోజుల్లో మరింత థ్రిల్ కలిగిస్తుందని ఆయన హామీ ఇచ్చినట్లు సమాచారం. దీంతో ‘డాకు మహరాజ్’ తర్వాత బాబీ, థమన్ కాంబినేషన్ మరోసారి అదిరిపోయే స్థాయిలో ఉండబోతోందనే అంచనాలు పెరుగుతున్నాయి. మెగాస్టార్ కొత్త సినిమా నుంచి విడుదలైన ట్రీట్‌లోనే భారీ స్థాయి కనిపించడంతో పూర్తి పాటలు, ఇతర ప్రచార కంటెంట్‌పై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
ఈ చిత్రంలో యువనటి అనస్వర రంజన్ మెగాస్టార్ కూతురు పాత్రలో నటిస్తోంది. మురళీ శర్మతో పాటు పలువురు కీలక నటులు ఇందులో భాగమయ్యారు. కే వి ఎన్ నిర్మాణ సంస్థ తెలుగులో తన తొలి సినిమాగా ఈ ప్రాజెక్ట్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన కంటెంట్‌తో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. రాబోయే రోజుల్లో థమన్ సంగీతానికి సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు వస్తే హైప్ మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని జనవరి 13న గ్రాండ్‌గా విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!