

అల్లు అర్జున్ ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న ‘రాకా’ చిత్రంతో బిజీగా ఉన్నారు. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది చివర్లో లేదా 2028లో విడుదల చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని ఒకే భాగంగా విడుదల చేయాలా? లేక రెండు భాగాలుగా తెరకెక్కించాలా? అనే అంశంపై చిత్రబృందం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, ‘రాకా’ తర్వాత అల్లు అర్జున్-లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కాల్సిన #AA23 ప్రాజెక్ట్ ఆగిపోయిందంటూ ఇటీవల రూమర్స్ వైరల్ అయ్యాయి. అయితే ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలోనే ఉందని, వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి చిత్రీకరణ ప్రారంభం కానుందని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్‌పై వస్తున్న పుకార్లతో బన్నీ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. మరోవైపు బోయపాటి శ్రీనుతోనూ అల్లు అర్జున్ ఓ సినిమా చేయనున్నట్లు ప్రచారం జరుగుతుండగా, దానిపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!