

మలయాళ నటి మమితా బైజు ప్రస్తుతం ఇండియన్ సినిమాలో ఆసక్తిని రేకెత్తిస్తున్న భారీ ప్రాజెక్ట్‌లో భాగం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ ‘హను-మాన్’కు సీక్వెల్‌గా రూపొందుతున్న ‘జై హనుమాన్’లో మమితా బైజు కీలక పాత్రలో నటించనున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ‘ప్రేమలు’, ‘డ్యూడ్’, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న మమితకు ఇలాంటి భారీ మైథాలజీ ఫాంటసీ ప్రాజెక్ట్‌లో అవకాశం దక్కితే అది ఆమె కెరీర్‌లో కీలక మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది.
‘హను-మాన్’లో తేజ సజ్జ సృష్టించిన ప్రభంజనం కారణంగా ‘జై హనుమాన్’పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి ఈ ప్రాజెక్ట్‌లో ప్రధాన పాత్రలో నటిస్తుండటంతో ఆసక్తి మరింత పెరిగింది. అయితే మమితా బైజు ఎంపికపై మేకర్స్ నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. ఆమె సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించనున్నట్లు మాత్రమే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఈ వార్త నిజమైతే ప్రాజెక్ట్‌కు మరింత కొత్తదనం, ఆకర్షణ జోడించే అవకాశం ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!