

అక్కినేని నాగచైతన్య తన కెరీర్‌లో మరో ప్రత్యేకమైన మైలురాయికి చేరుకుంటున్నారు. తన 25వ సినిమాను ఎంతో ప్రత్యేకంగా రూపొందించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈసారి ప్రేక్షకులకు ఇప్పటివరకు పరిచయం లేని ఓ విభిన్నమైన నేపథ్యంలో ప్రేమకథను ఎంచుకున్నారట. సాధారణ ప్రేమకథలకు భిన్నంగా, కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. యువ దర్శకుడు బెదురులంక ఫేమ్ క్లాక్స్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కథలోని నేపథ్యం, పాత్రల రూపకల్పన విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.
నాగచైతన్య తన 25వ చిత్రంగా ఈ కథను ఎంచుకోవడం ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటివరకు చేసిన సినిమాలతో పోలిస్తే ఈ ప్రాజెక్ట్‌లో కొత్త తరహా అనుభూతిని అందించాలనే ప్రయత్నం కనిపిస్తోంది. ప్రేమకథకు ఇంతకుముందు చూడని నేపథ్యాన్ని జోడించడం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై సినీ అభిమానుల్లో చర్చ మొదలైంది. కథకు సంబంధించిన పూర్తి వివరాలు, ఇతర నటీనటులు, సాంకేతిక బృందం గురించి అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. నాగచైతన్య వెండితెర ప్రయాణంలో 25వ సినిమా ఎలాంటి ప్రత్యేకతను తీసుకొస్తుందో చూడాలి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!