

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా, గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘టాక్సిక్’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. భారతీయ ప్రేక్షకులతో పాటు హాలీవుడ్ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నారు. లయన్స్‌గేట్ సంస్థ ద్వారా హాలీవుడ్‌లోనూ విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన సెన్సార్ కట్స్‌పై సోషల్ మీడియాలో కొత్త ప్రచారం వైరల్ అవుతోంది. భారతీయ వెర్షన్ నుంచి ఏకంగా 20 నిమిషాల నిడివిని తొలగించినట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ ప్రచారం నిజమైతే భారతీయ వెర్షన్ నిడివి 2 గంటల 55 నిమిషాలు, ఓవర్సీస్ వెర్షన్ నిడివి 3 గంటల 15 నిమిషాలు ఉంటుందని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ వివరాలు హాలీవుడ్ వెర్షన్‌కు సంబంధించినవేనా అన్నదానిపై స్పష్టత లేదు. గతంలోనూ ఇంగ్లీష్ వెర్షన్‌లో పాటలు లేకుండా, తక్కువ నిడివితో సినిమా విడుదల కానుందని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న సెన్సార్ కట్స్‌పై చిత్రబృందం అధికారికంగా స్పందించాల్సి ఉంది. అప్పటివరకు ఈ ప్రచారాన్ని ధృవీకరించని రూమర్‌గానే చూడాలి.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!