

దర్శకుడు త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘గాడ్ ఆఫ్ వార్’ చిత్రంపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ భుజం గాయం కారణంగా షూటింగ్ వాయిదా పడటంతో, ఈ సమయాన్ని త్రివిక్రమ్ స్క్రిప్ట్‌ను మరింత బలంగా తీర్చిదిద్దేందుకు ఉపయోగిస్తున్నారని తెలుస్తోంది. కథలో మార్పులు, సన్నివేశాల మెరుగుదలతో పాటు సినిమాలో కనిపించబోయే ప్రపంచాన్ని కూడా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయట. ముఖ్యంగా తెలుగు తెరపై ఇప్పటివరకు చూడని ఓ భారీ ప్రపంచాన్ని ప్రేక్షకులకు చూపించేందుకు విఎఫ్ఎక్స్‌పై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నట్లు సమాచారం. ‘డ్రాగన్’ తర్వాత ఎన్టీఆర్ నటించనున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై సహజంగానే భారీ అంచనాలు ఉన్నాయి. పైగా మైథలాజికల్ నేపథ్యంతో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడం విశేషం.
సుబ్రహ్మణ్య స్వామి కథతో రూపొందుతున్న ఈ సినిమాలో ఆయన పాత్రలోని దైవత్వాన్ని మరింత బలంగా చూపించేందుకు త్రివిక్రమ్ స్క్రిప్ట్‌లో పలు మార్పులు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. తన డ్రీమ్ ప్రాజెక్ట్ కావడంతో ప్రతి అంశాన్ని ఎంతో జాగ్రత్తగా తెరకెక్కించేందుకు దర్శకుడు సిద్ధమవుతున్నారట. భారీ నిర్మాణ విలువలతో రూపొందనున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కథ, విజువల్స్, విఎఫ్ఎక్స్ విషయంలో ఎక్కడా రాజీపడకుండా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!