

‘ఉప్పెన’తోనే రూ.100 కోట్ల రేంజ్ విజయాన్ని అందుకున్న వైష్ణవ్ తేజ్.. ఆ తర్వాత ‘కొండపొలం’, ‘రంగ రంగ వైభవంగా’, ‘ఆదికేశవ’ సినిమాలతో విభిన్న కథలను ఎంచుకున్నారు. అయితే ఈ చిత్రాలు ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందించలేకపోయాయి. అవకాశాలు తగ్గిపోవడం వల్ల ఆయన సినిమాలకు దూరంగా ఉన్నారనే ప్రచారం ఉన్నప్పటికీ.. తనకు సరిగ్గా సరిపోయే కథ కోసం ఎదురుచూస్తున్నారనే టాక్ ఎక్కువగా వినిపిస్తోంది.
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత వైష్ణవ్ తేజ్ ఇప్పుడు కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కెరీర్‌లో ఇంత పెద్ద గ్యాప్ రావడం, గత చిత్రాల ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఈ మూవీపై ఆసక్తి నెలకొంది. ఈసారి ఎలాంటి కథను ఎంచుకున్నారు? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటారు? అనేది కీలకంగా మారింది. ఈ సినిమా ఫలితం వైష్ణవ్ తేజ్ కెరీర్‌పై ప్రభావం చూపించే అవకాశముందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!