

వెంకటేష్–త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘ఆదర్శ కుటుంబం’ కథకు తమిళ, తెలుగు భాషల్లో అనూహ్య విజయాన్ని అందుకున్న ‘బ్లాస్ట్’తో పోలిక ఉందంటూ గతంలో వార్తలు వచ్చాయి. ఈ కారణంగానే చిత్రీకరణను నిలిపివేసి కథలో మార్పులు చేశారనే ప్రచారం కూడా జరిగింది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ధృవీకరణ రాలేదు. దీంతో ఆ వార్తలకు ఇప్పటికీ స్పష్టత లేదు.
ఇటీవల ‘ఆదర్శ కుటుంబం’ కథా నేపథ్యం గురించి త్రివిక్రమ్ మాట్లాడినప్పుడు ‘బ్లాక్ స్వాన్’ ప్రభావాన్ని ప్రస్తావించారు. అనుకోని వ్యక్తులు లేదా పరిణామాలు ఒక పరిస్థితిని పూర్తిగా మార్చేయడాన్ని ఆయన వివరించారు. ‘బ్లాస్ట్’ కథలోనూ మధ్యతరగతి కుటుంబం అనుకోకుండా ఓ పెద్ద వ్యాపారవేత్త ప్రణాళికలోకి ప్రవేశించి పరిణామాలను మార్చే పరిస్థితి ఉంటుంది. దీంతో రెండు చిత్రాల మధ్య పోలికలపై మళ్లీ చర్చ మొదలైంది. అయితే ‘ఆదర్శ కుటుంబం’లో అసలు కథ ఎలా ఉండబోతోందో సినిమా విడుదలయ్యే వరకు పూర్తి స్పష్టత వచ్చే అవకాశం లేదు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!