

నేటి కాలంలో విస్తృతంగా కనిపిస్తున్న ఆరోగ్య సమస్యల్లో థైరాయిడ్ ఒకటి. పురుషులతో పోలిస్తే మహిళల్లో ఈ సమస్య వచ్చే అవకాశం 5 నుంచి 8 రెట్లు ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రతి 8 మంది మహిళల్లో ఒకరు జీవితకాలంలో థైరాయిడ్ సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉంది. అకస్మాత్తుగా బరువు మార్పులు, తీవ్రమైన అలసట, జుట్టు రాలడం, నెలసరి సమస్యలు వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే టీఎస్‌హెచ్, టి3, టి4 వంటి రక్త పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
మెడలో సీతాకోకచిలుక ఆకారంలో ఉండే థైరాయిడ్ గ్రంథి శరీర జీవక్రియను నియంత్రిస్తుంది. మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా రావడానికి ఆటోఇమ్యూన్ వ్యాధులు, గర్భధారణ, ప్రసవానంతర కాలం, మెనోపాజ్ సమయంలో హార్మోన్ మార్పులు ప్రధాన కారణాలు. హైపోథైరాయిడిజం లేదా హైపర్‌థైరాయిడిజం లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం ద్వారా ఈ సమస్యను నియంత్రించవచ్చు.
గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏవైనా ఆరోగ్య సమస్యలు లేదా సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించి వారి సూచనలు పాటించండి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!