

2026 టాలీవుడ్‌కు మంచి విజయాల ఏడాదిగా నిలిచే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది పలువురు స్టార్ హీరోలు కంబ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర్ వరప్రసాద్ గారు’తో భారీ విజయాన్ని అందుకున్నారు. గతంలో కొన్ని సినిమాలు మంచి టాక్ తెచ్చుకున్నా ఆశించిన స్థాయిలో వసూళ్లు రాకపోవడంతో, ఈ విజయం ఆయనకు మరింత ప్రత్యేకంగా మారింది. అదే సమయంలో శర్వానంద్ నటించిన ‘నారి నారి నడుమ మురారి’ కూడా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. వరుస పరాజయాలతో ఉన్న శర్వానంద్‌కు ఈ సినిమా కొత్త ఊపునిచ్చింది. అక్కినేని అఖిల్ ‘లెనిన్’తో విజయాన్ని అందుకోవడంతో పాటు 100 కోట్ల క్లబ్‌లోకి చేరాడు.
వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’తో హిట్ అందుకుని 50 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించాడు. రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ తర్వాత ‘పెద్ది’తో విజయాన్ని అందుకున్నాడు. ఓవర్సీస్‌లో కొన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ సమస్యలు ఉన్నా, మొత్తంగా సినిమా హిట్‌గా నిలిచింది. ఇప్పుడు రవితేజ ‘ఇరుముడి’తో మరోసారి ఫామ్‌లోకి వచ్చారు. ‘క్రాక్’ తర్వాత వచ్చిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, ‘ఇరుముడి’కి తొలి ఆట నుంచే పాజిటివ్ స్పందన వచ్చింది. మరోవైపు సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’తో తెలుగులోనూ మంచి వసూళ్లు సాధిస్తున్నారు. సమంత ‘మా ఇంటి బంగారం’, కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’, నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ కూడా ఆకట్టుకున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!