

ఉక్రెయిన్-అమెరికన్ ర్యాప్ సింగర్ ఆల్బర్ట్ వాసిలీవ్ (కీవ్‌స్టోనర్) హత్యకు రష్యా నిఘా విభాగాలు కుట్ర పన్నినట్లు యూరప్‌లోని భద్రతా సంస్థలు ఆరోపించాయి. ఈ ఏడాది ఆగస్టులో పోలాండ్‌లో, సెప్టెంబర్‌లో డెన్మార్క్‌లో ఆయనను హతమార్చేందుకు ప్రయత్నాలు జరిగినట్లు వెల్లడించాయి. ఆగస్టు 7న పోలాండ్‌లో ఈ కుట్రకు సంబంధం ఉందని అనుమానిస్తున్న రష్యా పౌరుడిని అక్కడి అధికారులు అరెస్టు చేశారు. రష్యా నిఘా సంస్థల ప్రోద్బలంతోనే ఈ ప్రయత్నం జరిగినట్లు పోలాండ్ అధికారులు పేర్కొన్నారు.
సెప్టెంబర్ 25న కోపెన్‌హాగన్ సమీపంలో జరగాల్సిన కీవ్‌స్టోనర్ సంగీత కార్యక్రమం సందర్భంగా రెండో హత్యాయత్నానికి ప్రణాళిక రూపొందించినట్లు డెన్మార్క్ భద్రతా సంస్థలు వెల్లడించాయి. అయితే పోలీసులు ముందుగానే అప్రమత్తమై నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన డెన్మార్క్ ప్రభుత్వం రష్యా రాయబారిని పిలిపించి, ఆ దేశ రక్షణ దౌత్యవేత్తను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. రష్యా పౌరుల ప్రయాణాలపై యూరోపియన్ యూనియన్ స్థాయిలో ఆంక్షలు విధించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. మరోవైపు ఈ ఆరోపణలకు ఆధారాలు లేవని రష్యా ఖండించింది. ఈ పరిణామాలతో రష్యా, యూరప్ దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!