
సినిమాలు

ఎన్టీఆర్ జిల్లాలో పెద్దపులి సంచారం స్థానిక ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. గంపలగూడెం మండలం కనుమూరు అటవీ ప్రాంతంలోనే పెద్దపులి వరుసగా మూడో రోజు కూడా ఉన్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం పులి సంచారం ఉన్న ప్రాంతం చుట్టూ సుమారు 50 మీటర్ల పరిధిలోనే దాని కదలికలు ఉన్నట్లు సమాచారం. ట్రాకర్ సాయంతో అటవీశాఖ అధికారులు పులి కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
పెద్దపులిని సురక్షితంగా బంధించేందుకు పుణెకు చెందిన నిపుణులతో పాటు ప్రత్యేక బృందాలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. మరోవైపు సమీప గ్రామాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆర్డీవో సూచించారు. పులి సంచరిస్తున్న ప్రాంతాల వైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అటవీశాఖ అధికారులు ఇచ్చే సూచనలను పాటించాలని స్థానికులకు హెచ్చరికలు జారీ చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!