
జనరల్

నారా కుటుంబంలో మరో వారసుడి రాకతో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ప్రముఖ నటుడు నారా రోహిత్ భార్య శిరీష సోమవారం రాత్రి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు కుటుంబ వర్గాలు వెల్లడించాయి. ఈ శుభవార్తతో కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సామాజిక మాధ్యమాల్లో నారా రోహిత్ దంపతులకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. గతేడాది అక్టోబర్ 30న వివాహ బంధంలో అడుగుపెట్టిన నారా రోహిత్, శిరీష దంపతులు ఇప్పుడు తల్లిదండ్రులుగా కొత్త జీవితాన్ని ఆరంభించారు. తల్లి, శిశువు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!