
సినిమాలు

ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతున్న 'లెనిన్' సినిమా సక్సెస్ మీట్‌లో హీరో అఖిల్ అక్కినేని భావోద్వేగానికి గురయ్యారు. గత మూడు సంవత్సరాలుగా ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్న సమయంలో తన భార్య జైనబ్ ఎప్పుడూ తనకు అండగా నిలిచి ధైర్యం చెప్పిందని తెలిపారు. ఆమెను ఇంట్లో ప్రేమగా "బంగారు తల్లి" అని పిలుస్తానని, తనకు మార్గదర్శిలా ఉండి ప్రతి అడుగులోనూ మద్దతు ఇచ్చిందని చెప్పారు.
తన తండ్రి నాగార్జున గురించి మాట్లాడిన అఖిల్, ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా తనను నిరుత్సాహపరచలేదని, ఎప్పుడూ స్నేహితుడిలా వెన్నంటే నిలిచారని అన్నారు. 'లెనిన్' విజయాన్ని అభిమానులకు అంకితం చేస్తూ, వారికోసం హిట్ సినిమా ఇవ్వాలనే తపనతో పనిచేశానని చెప్పారు. విజయంతో గర్వపడనని, వినయంతో తన కొత్త ప్రయాణాన్ని కొనసాగిస్తానని అఖిల్ పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!