

నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న ‘అలియాస్ రుక్మిణి’ ప్రీ రిలీజ్ వేడుకలో నాని తన కెరీర్ తొలినాళ్లకు సంబంధించిన ఓ ఆసక్తికర జ్ఞాపకాన్ని పంచుకున్నారు. నాని సమర్పణలో మురళీకాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. శనివారం జరిగిన వేడుకలో నాని మాట్లాడుతూ.. నితిన్ నటించిన ‘అల్లరి బుల్లోడు’ సినిమాకు తాను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశానని గుర్తుచేసుకున్నారు. అప్పట్లో హీరోలను ‘బాబూ’ అని పిలవాలని తనకు తెలియక, నితిన్‌ను నేరుగా పేరు పెట్టి పిలిచేవాడినని చెప్పారు. దీంతో ఓ మేనేజర్ తనపై కోప్పడి, హీరోను ‘బాబూ’ అని పిలవాలని సూచించారని తెలిపారు.
ఆ తర్వాత నితిన్‌ను ‘బాబూ రండి’ అని పిలవడంతో తన పిలుపులో మార్పును గమనించిన ఆయన, అసలు ఏం జరిగిందో చెప్పేవరకు షాట్‌కు రానని సరదాగా పట్టుబట్టారని నాని వెల్లడించారు. మేనేజర్ తమ సాన్నిహిత్యంపై అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం చెప్పగానే, ఆయనకు మరింత కోపం వచ్చేలా ఏం చేయాలని నితిన్ అడిగారట. ఇద్దరూ కలిసి సెట్లోకి వెళ్లాలని, తనపై చేయి వేసుకుని రావాలని, చివరగా తనకు గొడుగు పట్టాలని నాని చెప్పడంతో నితిన్ అలాగే చేశారని గుర్తుచేసుకున్నారు. అప్పటి నుంచి ఇద్దరూ సరదాగా ఒకరినొకరు ‘బాబూ’ అని పిలుచుకుంటున్నామని తెలిపారు. ఆ మధుర జ్ఞాపకాన్ని గుర్తుచేస్తూ ప్రీ రిలీజ్ వేడుకలో నితిన్ నానికి గొడుగు పట్టి వేదికపైకి తీసుకెళ్లడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!