

అక్కినేని నాగార్జున వారసత్వాన్ని అందిపుచ్చుకుని సినీ పరిశ్రమలోకి వచ్చిన అక్కినేని అఖిల్ మంచి విజయాన్ని అందుకోవడానికి కష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే లెనిన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రంలో అఖిల్ హీరోగా నటిస్తుండగా, భాగ్యశ్రీ హీరోయిన్గా కనిపించనుంది. మురళి కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ఒక స్టార్ హీరో సుమారు 15 నిమిషాల పాటు ప్రత్యేక పాత్రలో కనిపించనున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
ఆ స్టార్ హీరో ఎవరు అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అలాగే సినిమా క్లైమాక్స్‌లో నాగార్జున సూచనల మేరకు కొన్ని మార్పులు చేసినట్లు సమాచారం. అఖిల్–భాగ్యశ్రీ మధ్య లవ్ ట్రాక్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. సినిమా అవుట్‌పుట్‌పై చిత్ర బృందం పూర్తి నమ్మకంతో ఉండగా, ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఈ చిత్రం వచ్చే నెల 10న విడుదలకు సిద్ధంగా ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!