
జనరల్

మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్, వరంగల్–ఖమ్మం–నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు సంబంధించిన ఓటర్ల ముసాయిదా జాబితాలను నేడు విడుదల చేయనున్నారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితాలో తమ పేర్లు ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు ఈ ముసాయిదా జాబితాలు ఉపయోగపడనున్నాయి. అర్హులైన పట్టభద్రులు జాబితాలో తమ పేర్లను పరిశీలించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ముసాయిదా జాబితాలో పేరు లేని అర్హులైన పట్టభద్రులు ఫామ్-18 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. ఇందుకు సంబంధించి డిసెంబర్ 10వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకుని ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!