

తమిళనాడు ముఖ్యమంత్రి, నటుడు విజయ్, నటి త్రిష లండన్‌లో కలిసి కనిపించిన వీడియోలు ఇటీవల వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. దీంతో మరోసారి వీరిద్దరి స్నేహంపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో నటి అంబిక ఓ ఇంటర్వ్యూలో విజయ్–త్రిష స్నేహం గురించి స్పందించారు. ఒక వ్యక్తి ఉన్నత స్థాయికి చేరుకున్నంత మాత్రాన పాత స్నేహాలను వదులుకోవాల్సిన అవసరం లేదని ఆమె పేర్కొన్నారు. అయితే తమ ప్రవర్తన కారణంగా స్నేహితుడిపై విమర్శలు వచ్చే అవకాశం ఉందని తెలిసినప్పుడు కొంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.
త్రిష స్థానంలో తాను ఉంటే.. తన వల్ల అనవసరమైన ప్రతికూలత ఏర్పడుతుందని భావిస్తే అలాంటి బహిరంగ కార్యక్రమాలకు వెళ్లకుండా ఉండేదానినని అంబిక తెలిపారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని స్పష్టం చేశారు. ఇద్దరు వ్యక్తులు మంచి స్నేహితులుగా ఉన్నప్పుడు, వారిలో ఒకరు ఉన్నత పదవిలో ఉన్నప్పటికీ ఆ స్నేహాన్ని మరో కోణంలో చూడాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. విజయ్, త్రిష మధ్య సంబంధంపై ఎలాంటి వ్యక్తిగత నిర్ధారణ చేయకుండా, తన అభిప్రాయాన్ని మాత్రమే అంబిక వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!