

‘ది ప్యారడైజ్’ సినిమా కోసం పొడవాటి జుట్టుతో రఫ్ లుక్‌లో కనిపించిన నాని, తన తదుపరి చిత్రం ‘బ్లడీ రోమియో’ కోసం కొత్త మేకోవర్‌తో సిద్ధమయ్యారు. ‘ది ప్యారడైజ్’ షూటింగ్ పూర్తయిన తర్వాత కూడా నాని పొడవాటి జుట్టుతోనే కనిపించడంతో, ఆయన మళ్లీ సాధారణ లుక్‌లోకి రావాలని అభిమానులు కోరుకున్నారు. తాజాగా ‘బ్లడీ రోమియో’ చిత్ర బృందం నాని కొత్త లుక్‌ను చూపించే వీడియోను విడుదల చేసింది. చక్కగా కత్తిరించిన జుట్టుతో స్టైలిష్‌గా కనిపిస్తున్న నాని, త్వరలో ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా షూటింగ్‌ను ప్రారంభించనున్నారు.
నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్, కామెడీ అంశాల మేళవింపుగా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. ఈ చిత్రంతో ప్రేక్షకులకు భిన్నమైన అనుభూతిని అందించనున్నట్లు నాని భావిస్తున్నారు. ప్రీతి ముకుందన్ కథానాయికగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. నాని కొత్త లుక్‌తో సినిమాపై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!