

శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఈథా’ సినిమా థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. తొలుత ఈ చిత్రాన్ని ‘టాక్సిక్’ సినిమాతో పోటీగా విడుదల చేయాలని భావించినప్పటికీ.. ఆ తర్వాత మేకర్స్ విడుదలను డిసెంబర్‌కు మార్చారు. అయితే ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. ముఖ్యంగా శ్రద్ధా కపూర్ డైలాగ్ డెలివరీపై కొందరు నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. పాత్రలోని గంభీరతను, భావోద్వేగాలను ఆమె పూర్తిస్థాయిలో పలికించలేకపోయారంటూ అభిప్రాయపడుతున్నారు. సినిమా విడుదలకు ముందే ఆమె నటనపై ఈ విధంగా చర్చ జరగడం ఆసక్తికరంగా మారింది.
అయితే ప్రచార చిత్రాలను చూసి మాత్రమే నటనపై తుది నిర్ణయానికి రావడం సరైంది కాదని చెప్పొచ్చు. పూర్తి సినిమా చూసిన తర్వాతే శ్రద్ధా కపూర్ నటనపై స్పష్టమైన అంచనాకు రావచ్చు. తనపై వస్తున్న విమర్శలకు ఆమె తన నటనతో సమాధానం చెబుతారా? ప్రేక్షకులను ఆకట్టుకుంటారా? అనేది వేచి చూడాలి. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం.. ప్రముఖ తమాషా కళాకారిణి విఠాబాయి నారాయణ్‌గావ్కర్ జీవితం ఆధారంగా తెరకెక్కుతోంది. ఇందులో రణ్‌దీప్ హుడా, మహ్మద్ జీషన్ అయ్యూబ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మ్యాడాక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దినేశ్ విజన్, లక్ష్మణ్ ఉటేకర్, కరిష్మా శర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!