

2027లో జరగనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. 2027 జూన్ 26 నుంచి జులై 7 వరకు గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా పుష్కరాలకు సుమారు 10 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో, వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించడం, పుష్కరాల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయడంపై సీఎం అధికారులతో చర్చించారు.
అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. 22 ప్రభుత్వ శాఖల పరిధిలో మొత్తం రూ.3,723.69 కోట్ల అంచనా వ్యయంతో 4,862 పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటిలో ఇప్పటివరకు రూ.2,051.70 కోట్ల విలువైన 2,260 పనులకు పరిపాలనా అనుమతులు లభించాయి. పుష్కరాలకు భారీగా భక్తులు తరలివచ్చే నేపథ్యంలో అవసరమైన అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాలు, ఇతర ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!