

తెలంగాణకు చెందిన ప్రముఖ దర్శకుడు, రచయిత, చిత్రకారుడు, ఫొటోగ్రాఫర్, రంగస్థల కళాకారుడు, సంగీతకారుడు, సాంస్కృతిక పరిశోధకుడు బి. నర్సింగరావును డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌తో సత్కరించనుంది. సినీ, సాహిత్య, కళా రంగాల్లో ఆయన అందించిన విశిష్ట సేవలను గుర్తిస్తూ ‘డాక్టర్ ఆఫ్ లిటరేచర్’ (హానరిస్ కాసా) గౌరవాన్ని ప్రదానం చేయనున్నట్లు సమాచారం.
‘మా భూమి’, ‘మా ఊరు’, ‘దాసి’, ‘మట్టి మనుషులు’ వంటి ప్రముఖ చిత్రాల ద్వారా తెలంగాణ జీవన విధానం, మాండలికం, జానపద సంప్రదాయాలు, సామాజిక వాస్తవాలను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పరిచయం చేసిన ఘనత నర్సింగరావుకు ఉంది. సినిమా, చిత్రకళ, ఫొటోగ్రఫీ, రంగస్థలం తదితర విభిన్న కళారూపాల్లో ఆయన చేసిన కృషి తెలంగాణ సాంస్కృతిక జ్ఞాపకాలను పరిరక్షించడంతో పాటు రాష్ట్ర ప్రత్యేక కళా గుర్తింపును విస్తృత భారతీయ కళా ప్రపంచంలో నిలబెట్టింది. ఈ బహుముఖ ప్రజ్ఞకు గుర్తింపుగా ఆయనను ‘తెలంగాణ రినైసాన్స్ మ్యాన్’గా అభివర్ణిస్తుంటారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!