
జనరల్

టాలీవుడ్ యువత ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘ఈనగరానికి ఏమైంది రిపీట్’ ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేసింది. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా, ప్రేక్షకుల ఆదరణ పొందిన ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందింది. నిన్న సాయంత్రం నుంచి పెయిడ్ ప్రీమియర్స్ ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి.
మరోవైపు, యూఎస్ మార్కెట్‌లోనూ ఈ సినిమా మంచి ఆరంభాన్ని అందుకుంది. ప్రీమియర్ సేల్స్ ద్వారా ఇప్పటికే 3 లక్షల డాలర్ల వసూళ్లను నమోదు చేసింది. దీంతో వివేక్ అండ్ గ్యాంగ్ ఈసారి మరింత భారీ ఓపెనింగ్స్ సాధించే అవకాశాలు ఉన్నాయని అంచనాలు పెరిగాయి. ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించగా, శివాత్మిక రాజశేఖర్, అభినవ్ గోమటం తదితరులు నటించారు. సృజన్ ఎరబోలు, నాగిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!