
సినిమాలు

చెన్నై లవ్ స్టోరీ మూవీ లవ్ కార్నివాల్ ఈవెంట్ విజయవాడలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ వేడుకలో నాలుగో సింగిల్ “హొయిలా హొయిలా” విడుదల చేశారు. హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ సహా పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చిత్ర బృందం సినిమా పాటలు, కథ, ఎమోషన్స్ గురించి మాట్లాడారు. హీరో కిరణ్ అబ్బవరం ప్రేక్షకులకు మునుపెన్నడూ చూడని ప్రేమ కథను చూపిస్తామని తెలిపారు. నిర్మాతలు ఎస్ కేఎన్, సాయి రాజేష్ సినిమా బలమైన ఎమోషన్స్, మంచి టెక్నికల్ వాల్యూస్‌తో రూపొందిందని చెప్పారు. రవి నంబూరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జూలై 24న థియేటర్లలో విడుదల కానుంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!