
రాజకీయాలు

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సంయుక్త జంటగా నటిస్తున్న మిస్టరీ థ్రిల్లర్ హైందవ విడుదల వాయిదా పడింది. తొలుత నవంబర్ 27న థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయించినప్పటికీ, ప్రేక్షకులకు అత్యుత్తమ సాంకేతిక ప్రమాణాలతో కూడిన సినిమాటిక్ అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో విడుదల తేదీని వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది.

నూతన దర్శకుడు లుధీర్ బైరెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, మహేష్ చందు నిర్మిస్తున్నారు. ఇందులో జేడీ చక్రవర్తి కీలక పాత్రలో నటిస్తున్నారు. సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారు. సినిమా కొత్త విడుదల తేదీని త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని నిర్మాతలు వెల్లడించారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!