
రాజకీయాలు

నటి జ్యోతిక తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో భర్త సూర్యతో తన బంధం, కెరీర్ ప్రారంభంలో ఎదురైన అనుభవాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. కెరీర్ ఆరంభంలో సూర్య కంటే తానే మూడు రెట్లు ఎక్కువ పారితోషికం తీసుకున్నానని తెలిపారు. అయితే ఆర్థిక విషయాలు తమ బంధంపై ఎప్పుడూ ప్రభావం చూపలేదని, ఒకరి కెరీర్‌ను మరొకరు గౌరవిస్తూ ముందుకు సాగామని చెప్పారు.
సూర్య సమానత్వాన్ని విశ్వసించే గొప్ప వ్యక్తి అని జ్యోతిక ప్రశంసించారు. సినిమా నిర్మాణం నుంచి పిల్లల పెంపకం, కుటుంబ నిర్ణయాలు, సెలవుల ప్రణాళికల వరకు ప్రతి విషయంలో ఇద్దరూ కలిసి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఒకరి విజయాన్ని మరొకరు హృదయపూర్వకంగా ఆనందించడమే తమ దాంపత్య జీవితానికి బలమని చెప్పారు. తమిళ చిత్రాల్లో కలిసి నటించిన ఈ జంట ప్రేమలో పడి, 2006 సెప్టెంబర్ 11న వివాహం చేసుకుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!