

‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాకు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. ఈ చిత్రంలోని నలుగురు యువకుల పాత్రలకు ఆడియెన్స్ ఎంతగానో కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు ఈ గ్యాంగ్ మరోసారి సీక్వెల్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈసారి నలుగురి బృందంలో శ్రీనాథ్ మాగంటి కూడా చేరారు. కార్తీక్ పాత్రలో ఆయన కనిపించనున్నారు. ‘ENE రిపీట్’ పేరుతో తెరకెక్కిన ఈ సినిమాను ఈ నెల 19న విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.
ట్రైలర్‌లో విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, వెంకటేష్ తమ కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకోగా, కొత్తగా గ్యాంగ్‌లో చేరిన శ్రీనాథ్ మాగంటి కూడా తనదైన నటనతో మెప్పించారు. ఇప్పటికే ప్రేక్షకులకు పరిచయమైన పాత్రల మధ్య కొత్తగా కనిపించడం సవాలుతో కూడుకున్నదే అయినప్పటికీ, కార్తీక్ పాత్రలో శ్రీనాథ్ ఒదిగిపోయినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఆయన లుక్, కామెడీ టైమింగ్, స్క్రీన్ ప్రజెన్స్ ఆకట్టుకుంటున్నాయి. తన అభిరుచిని ఎంచుకోవడం వల్ల ఎదురయ్యే సంఘర్షణల మధ్య సతమతమయ్యే నగర యువకుడిగా ఆయన పాత్ర ఉండబోతోందని ట్రైలర్ సూచిస్తోంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!