

విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ కలయికలో వచ్చిన ‘ఆదర్శ కుటుంబం’ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. తొలిరోజు ఈ చిత్రం రూ.16 కోట్లకు పైగా వసూళ్లు సాధించినప్పటికీ, ఈ కాంబినేషన్‌పై ఉన్న అంచనాలతో పోలిస్తే కొంత తక్కువేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వారాంతంలో వసూళ్లు పెరుగుతాయని చిత్ర బృందం భావిస్తున్న తరుణంలో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. సినిమాలో ఉపయోగించిన ఓ జానపద పాట విషయంలో కాపీరైట్ సమస్య తలెత్తింది. ఈ పరిణామం ఇప్పుడు చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. దీంతో నిర్మాతలకు కొత్త తలనొప్పి మొదలైనట్లయింది.
ఎస్.ఎల్.టి ఫిలిమ్స్ బ్యానర్‌పై ‘పర్ణశాల’ అనే హారర్ కామెడీ చిత్రాన్ని నిర్మిస్తున్న మంచి వెంకట్ ఈ ఆరోపణలు చేశారు. తమ సినిమాలో జానపద కళాకారిణి జి. లక్ష్మీదేవి రాసి, పాడిన ‘జిమ్ జిమ్ తారా’ పాటను ఎలాంటి అనుమతి లేకుండా ‘ఆదర్శ కుటుంబం’లో ఉపయోగించారని ఆయన పేర్కొన్నారు. దాదాపు 15 సెకన్ల పాటు పాటను వినియోగించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ న్యాయపరమైన చర్యలకు సిద్ధమవుతున్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ పాటకు మంచి ఆదరణ లభించింది. మరోవైపు ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించగా, థమన్ సంగీతం అందించారు. మరి ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!