

బాలీవుడ్ స్టార్ కపుల్ కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా మరోసారి గుడ్‌న్యూస్ చెప్పారు. తాము రెండో బిడ్డకు తల్లిదండ్రులు కాబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. బుధవారం షేర్ చేసిన సంయుక్త పోస్టులో చేతులు కలిపి ఉన్న ఫొటోతో పాటు.. వారి కుమార్తె చిన్న చేతులతో బేబీ సాక్స్‌ను పట్టుకున్న ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. “మరోసారి గొప్ప బహుమతితో ఆశీర్వదించబడ్డాం. మా హృదయాలు ప్రేమ, కృతజ్ఞతతో నిండిపోయాయి” అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ ప్రకటనతో అభిమానులు, సినీ ప్రముఖులు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
కియారా, సిద్ధార్థ్ దంపతులకు 2025 జూలై 15న తొలి సంతానం జన్మించింది. కియారా ఆగస్టులో ప్రసవించాల్సి ఉన్నప్పటికీ ముందుగానే ముంబైలోని గిర్గావ్ ప్రాంతంలోని హెచ్‌ఎన్ రిలయన్స్ ఆసుపత్రిలో పాపకు జన్మనిచ్చారు. అనంతరం తమ కుమార్తెకు సారాయా మల్హోత్రా అని పేరు పెట్టారు. తమ కుటుంబానికి సంబంధించిన శుభవార్తలను ప్రకటించే సందర్భాల్లో చిన్న బేబీ సాక్స్ ఫొటోను ఉపయోగించడం ఈ జంటకు ప్రత్యేకంగా మారింది. ఇప్పుడు రెండో ప్రెగ్నెన్సీ ప్రకటనలోనూ అదే తరహా ఫొటోను పంచుకోవడం విశేషం.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!