

‘సీతారామం’ సినిమాతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న నటి మృణాల్ ఠాకూర్ నటించిన ‘పూజా మేరీ జాన్’ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు నాలుగేళ్ల ఆలస్యం తర్వాత ఈ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదలై ప్రశంసలు అందుకుంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మృణాల్, ప్రతి విషయం జరగాల్సిన సమయంలోనే జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సినిమాను తన మొదటి బిడ్డతో పోల్చిన ఆమె, షూటింగ్ పూర్తయి ఇన్నేళ్లు గడిచినా అప్పటి జ్ఞాపకాలు తన మనసులో అలాగే ఉన్నాయని భావోద్వేగంగా చెప్పారు.
షూటింగ్ సమయంలో తీసుకున్న ఫొటోలు, వీడియోలు, పాటించిన కఠినమైన డైట్ ఇప్పటికీ గుర్తున్నాయని మృణాల్ తెలిపారు. ఈ చిత్రం కేవలం వినోదానికే పరిమితం కాకుండా, సమాజంలో చర్చించాల్సిన సున్నితమైన అంశాన్ని ప్రస్తావిస్తుందని చెప్పారు. సినిమా చూసిన తర్వాత పలువురు యువకులు తనకు ఫోన్ చేసి, ఒక అమ్మాయి వద్దు అని చెబితే దాని అర్థాన్ని గౌరవించాలని తెలుసుకున్నామని చెప్పడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. మహిళల వ్యక్తిగత జీవితాలపై సమాజం చేసే వ్యాఖ్యల గురించి స్పందిస్తూ, ప్రస్తుతంలో మాట్లాడటానికి కొత్త విషయాలు లేనప్పుడు కొందరు కావాలనే గతాన్ని తవ్వుతారని పరోక్షంగా వ్యాఖ్యానించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!