
జనరల్

కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటిస్తున్న 'చెన్నై లవ్ స్టోరీ' చిత్రం ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో మాట్లాడిన శ్రీ గౌరి ప్రియ, ఏడాది క్రితం విడుదలైన గ్లింప్స్‌కు ప్రేక్షకులు ఇచ్చిన ఆదరణకు కృతజ్ఞతలు తెలిపారు. సినిమా విడుదలకు కూడా అదే స్థాయిలో ప్రేమ, మద్దతు అందించాలని కోరారు.
ఈ సినిమా భావోద్వేగాలతో నిండిన కథగా ఉంటుందని ఆమె చెప్పారు. 'వదలనే' పాట లీడ్ సీన్‌తో పాటు సెకండాఫ్‌లో వచ్చే కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులకు చిరస్థాయిగా గుర్తుండిపోతాయని తెలిపారు. తన పాత్రలో ఎన్నో వైవిధ్యమైన కోణాలు ఉంటాయని, హీరోతో సమాన ప్రాధాన్యతతో దర్శకుడు ఆ పాత్రను తీర్చిదిద్దారని వెల్లడించారు. ఇప్పటికే విడుదలైన నాలుగు పాటల్లో నాలుగు భిన్నమైన లుక్స్‌లో కనిపించడం కూడా అదే పాత్ర ప్రత్యేకత అని చెప్పారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!