

విజయ్ ఆంటోనీ నటించిన ‘వంద దేవుళ్ళు’ చిత్ర ట్రైలర్‌ను మెగా ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, ఫాతిమా విజయ్ ఆంటోనీ సమర్పణలో, సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామంజనేయులు జవ్వాజి నిర్మించిన ఈ చిత్రం జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో స్వాసిక, అజయ్, కావ్య, శక్తి, బాలాజీ శక్తివేల్, అరుళ్ దాస్, మునిష్‌కాంత్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
‘ఈ లోకంలో ప్రాణాలతో పుట్టిన అందరికీ కనీస అవసరాలుంటాయి’ అనే భావోద్వేగ డైలాగ్‌తో ప్రారంభమైన ట్రైలర్ ప్రేమ, కుటుంబ బంధాలు, మానవీయ విలువలను హృద్యంగా ఆవిష్కరించింది. యాక్షన్, ఎమోషన్స్, అద్భుతమైన విజువల్స్, ఆకట్టుకునే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ట్రైలర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్వాసిక నటనపై ప్రశంసలు కురిపించిన నిహారిక కొణిదెల, విజయ్ ఆంటోనీ ఈ చిత్రంతో మరో బ్లాక్‌బస్టర్ అందించబోతున్నారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!