

లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ డివోషనల్ కామెడీ మూవీ ‘మూకుత్తి అమ్మన్ 2’ నవంబర్ 6న థియేటర్లలో విడుదల కానుంది. 2020లో విడుదలై విజయవంతమైన ‘మూకుత్తి అమ్మన్’ చిత్రానికి ఇది సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. సుందర్ సి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఐషారీ కె. గణేష్ నిర్మిస్తున్నారు. నయనతార మరోసారి అమ్మవారి పాత్రలో కనిపించనుండగా, రెజినా కేసాండ్రా, ఖుష్బూ, స్నేహ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. షూటింగ్ పూర్తయిన నేపథ్యంలో సినిమా విడుదలపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో నయనతార సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ నోట్‌ను పంచుకున్నారు. కెమెరాలు ఆగిపోయిన తర్వాత కూడా కొన్ని సినిమాలు మనసులో నిలిచిపోతాయని, తన కెరీర్‌లో ‘మూకుత్తి అమ్మన్ 2’ అలాంటి ప్రత్యేకమైన చిత్రమని ఆమె పేర్కొన్నారు.
ఈ చిత్రానికి తన విజన్, ప్రేమ, ప్యాషన్‌ను అందించిన దర్శకుడు సుందర్ సికి నయనతార ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి సన్నివేశాన్ని ఎంతో శ్రద్ధతో రూపొందించి, ఈ ప్రయాణాన్ని గుర్తుండిపోయేలా చేసినందుకు ఆయనతో కలిసి పనిచేయడం గొప్ప అనుభూతిని ఇచ్చిందని చెప్పారు. ఈ ప్రాజెక్ట్‌పై నమ్మకం ఉంచి మద్దతుగా నిలిచిన నిర్మాత ఐషారీ కె. గణేష్‌కు కూడా ధన్యవాదాలు తెలిపారు. కథను మనస్ఫూర్తిగా నమ్మే నిర్మాత ఉండటం వల్ల ప్రయాణం మరింత అర్థవంతంగా మారిందని పేర్కొన్నారు. ఖుష్బూ, స్నేహలతో కలిసి నటించడం ఎప్పటికీ గుర్తుండిపోయే అనుభవమని చెబుతూ వారిపై తన అభిమానాన్ని వ్యక్తం చేశారు. చివరగా, అద్భుతమైన బృందంతో పనిచేసే అవకాశం లభించడం తన అదృష్టమని, తాము రూపొందించిన భక్తి ప్రపంచాన్ని ప్రేక్షకులు థియేటర్లలో చూసే క్షణం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని నయనతార తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!