

జోసెఫ్ విజయ్ నటిస్తున్న 'జననాయగన్' చిత్రం విడుదల తేదీపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పలు ప్రచారాలు సాగుతున్నాయి. సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందనే ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో, ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న ప్రియమణి తాజాగా స్పందించారు. ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆమె, ఇప్పటివరకు తనకూ అధికారిక విడుదల తేదీ తెలియదని, ప్రస్తుతం నిర్మాతలు తేదీని ఖరారు చేసే పనిలో ఉన్నారని వెల్లడించారు. త్వరలోనే చిత్రబృందం అధికారిక ప్రకటన చేస్తుందని ఆమె తెలిపారు.
అదే సమయంలో ఈ సినిమా జూలై నెలాఖరులో విడుదలయ్యే అవకాశం ఉందని కూడా ప్రియమణి సంకేతాలిచ్చారు. విజయ్ రాజకీయ ప్రయాణాన్ని ప్రశంసిస్తూ, ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ఆయన ముందుకు సాగుతున్నారని, నాయకత్వ లక్షణాలు ఆయనలో సహజంగానే ఉన్నాయని పేర్కొన్నారు. సినీ రంగంలో విజయాన్ని సాధించిన ఆయన ఇప్పుడు ప్రజాసేవ దిశగా అడుగులు వేయడం అభినందనీయమని అన్నారు. అయితే సినిమా విడుదల తేదీపై అధికారిక ప్రకటన వచ్చే వరకు అభిమానులు వేచి చూడాల్సిందేనని సినీ వర్గాలు భావిస్తున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!