

సుకుమార్ రైటింగ్స్ నుంచి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 3 సినిమాలు ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఒక్కో చిత్రం ఒక్కో విభిన్నమైన కథాంశంతో రూపొందుతుండటం విశేషం. రామ్ చరణ్‌తో తెరకెక్కుతున్న RC17 అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా నిలుస్తుండగా, నాగ చైతన్య వృషకర్మ మిస్టరీ అంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు సిద్ధు10 పూర్తి స్థాయి ప్రేమకథగా రూపొందుతోంది.
ఈ నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న RC17 భారీ స్థాయిలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రంగా గుర్తింపు పొందుతోంది. రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు వృషకర్మ మిస్టరీ, ఆధ్యాత్మిక అంశాల కలయికతో సాగే థ్రిల్లర్‌గా సిద్ధమవుతోంది. ఈ సినిమా చైతూ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే అవకాశం ఉంది. సిద్ధు10 మాత్రం దైవిక స్పర్శతో కూడిన ప్రేమకథగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా సిద్ధూ జొన్నలగడ్డకు కంబ్యాక్ చిత్రంగా నిలిచే అవకాశం కలిపిస్తుంది. ఇలా విభిన్నమైన నేపథ్యాలు, కథాంశాలతో రూపొందుతున్న ఈ 3 చిత్రాలు సుకుమార్ రైటింగ్స్‌కు ప్రత్యేక ఆకర్షణగా మారనున్నాయి. వీటిలో ఏవి భారీ విజయాలు అందుకుంటాయో చూడాలి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!