
క్రీడలు

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ నటిస్తున్న చిత్రాల్లో ‘వడ్డీకాసుల వాడ’ ఒకటి. పూర్తి స్థాయి వినోదాత్మక కుటుంబ కథాచిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు తేజ్ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్నారు. సాధారణ మధ్యతరగతి కుటుంబం నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కోలీవుడ్ నటుడు రవిమోహన్ శ్రీ వేంకటేశ్వర స్వామి పాత్రలో కనిపించనున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మంచు మనోజ్ ఈ విషయంపై స్పష్టత ఇస్తూ రవిమోహన్ సినిమాలో నటిస్తున్నట్లు తెలిపారు. తాజాగా రవిమోహన్ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. శ్రీ గోవిందుని దివ్య పాత్రలో రవిమోహన్‌ను ‘వడ్డీకాసుల వాడ’లోకి ఆహ్వానిస్తున్నందుకు ఆనందంగా ఉందని చిత్రబృందం పేర్కొంది. ఈ పోస్టర్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!