

శర్వానంద్ కథానాయకుడిగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘భోగి’. అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి కథానాయికలుగా నటిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె.రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో చిత్ర బృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. ఇప్పటివరకు చూడని సరికొత్త మాస్ అవతారంలో శర్వానంద్ కనిపించడంతో ట్రైలర్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.
ట్రైలర్‌ను పరిశీలిస్తే.. సినిమాలో యాక్షన్‌తో పాటు కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాలకు కూడా ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో శర్వానంద్ ఐదుగురు చెల్లెళ్లకు అన్నగా నటిస్తున్నారు. ఆయన పాత్రలోని మాస్ లుక్, యాక్షన్ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. యాక్షన్, కుటుంబ భావోద్వేగాల కలయికగా రూపొందిన ‘భోగి’ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో తెలియాలంటే నవంబర్ 27 వరకు వేచి చూడాల్సిందే.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!