

తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న బడ్జెట్ సినిమాలకు తగిన అవకాశాలు లభించడం లేదని హీరో, దర్శకుడు షిరాజ్ మెహదీ ఆరోపించారు. తన చిత్రం ‘ఓ అందాల రాక్షసీ’కి ఏడాదిగా థియేటర్లు కేటాయించాలని కోరుతున్నప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా తన నిర్మాణ సంస్థ బ్యానర్ రిజిస్ట్రేషన్‌ను ఫిల్మ్ ఛాంబర్ తిరస్కరించిందని, తన ప్రెస్మీట్లు, వీడియోల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారని వెల్లడించారు. చిన్న సినిమాలకు థియేటర్ల కేటాయింపుతో పాటు ఓటీటీ, శాటిలైట్, పంపిణీ రంగాల్లోనూ వివక్ష కొనసాగుతోందని ఆయన విమర్శించారు.
చిన్న నిర్మాతలకు సమాన అవకాశాలు కల్పించాలని, క్యూబ్, యూఎఫ్ఓ డిజిటల్ సర్వీసుల ధరలు తగ్గించాలని షిరాజ్ డిమాండ్ చేశారు. చిన్న బడ్జెట్ చిత్రాలకు ప్రభుత్వ సబ్సిడీలు, ఓటీటీ, శాటిలైట్ హక్కుల ద్వారా వ్యాపార అవకాశాలు కల్పించాలని కోరారు. ఈ సమస్యను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని, అవసరమైతే ప్రెస్మీట్లు, ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తానని హెచ్చరించారు. న్యాయపరంగానూ పోరాటం కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ‘ఓ అందాల రాక్షసీ’ విడుదలయ్యే వరకు మరో సినిమాను ప్రారంభించబోనని స్పష్టం చేశారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!