

పవన్ కళ్యాణ్, సుజీత్ కలయికలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘OG 2’పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్‌లో ప్రారంభం కానుందనే ప్రచారం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయింది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ నేపథ్యంలో సంగీత దర్శకుడు థమన్ చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి.
థమన్ వ్యాఖ్యలను పరిశీలిస్తే, ఆయన షూటింగ్ ప్రారంభంపై కాకుండా సెప్టెంబర్ 2న ఒక ప్రత్యేక అప్డేట్ వచ్చే అవకాశాన్ని మాత్రమే సూచించినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ప్రత్యేక ప్రకటన లేదా గ్లింప్స్ విడుదలయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు, చిత్రీకరణ పనులు నవంబర్ ప్రాంతంలో ప్రారంభమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని సమాచారం. దీంతో సెప్టెంబర్‌లో షూటింగ్ ప్రారంభమవుతుందనే వార్తలకు ప్రస్తుతం స్పష్టత వచ్చినట్లైంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!