
సినిమాలు

తెలుగులో వరుస పరాజయాలు ఎదురవడంతో శ్రీలీల కెరీర్‌లో కొంత వేగం తగ్గింది. దీంతో ఈ అమ్మడు ఇప్పుడు ఇతర భాషల సినిమాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. ముఖ్యంగా తమిళం, హిందీ చిత్ర పరిశ్రమల్లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే అజిత్, రజనీకాంత్ వంటి అగ్ర హీరోల సినిమాల్లో నటించే ఛాన్సులు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే శ్రీలీలకు ఇంతగా అవకాశాలు రావడం వెనుక మరో ఆసక్తికరమైన విషయం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. గతంలో తీసుకున్న పారితోషికంతో పోలిస్తే ఇప్పుడు ఆమె భారీగా తగ్గించుకుందని సమాచారం. అవకాశాలు పెంచుకోవడంతో పాటు ఇతర భాషల్లోనూ తన మార్కెట్‌ను విస్తరించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రెమ్యునరేషన్ విషయంలో సర్దుబాటు చేసుకోవడం ఆమెకు కలిసొస్తోందనే టాక్ వినిపిస్తోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!