

టాలీవుడ్ యువ కథానాయకులు ఇప్పుడు తమ సినిమాల విషయంలో కొత్త పంథాను ఎంచుకుంటున్నారు. సాధారణ కమర్షియల్ కథలు, రొటీన్ మాస్ చిత్రాలకు దూరంగా ఉంటూ విభిన్నమైన కథాంశాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. 2027 నాటికి తమ మార్కెట్‌ను మరింత విస్తరించాలనే లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో సాయి దుర్గా తేజ్ సంబరాల ఏటిగట్టు కోసం పీరియాడిక్ కథను ఎంచుకున్నారు. ఇందులో ఆయన మునుపెన్నడూ కనిపించని రా అండ్ రగ్డ్ లుక్‌లో శక్తివంతమైన పాత్ర పోషిస్తున్నారు.
మరోవైపు నిఖిల్ స్వయంభు, ది ఇండియా హౌస్ చిత్రాలతో ముందుకు సాగుతున్నారు. చారిత్రక కథలకు ప్రాధాన్యమిస్తూ జాతీయ స్థాయిలో తన మార్కెట్‌ను పెంచుకోవాలని చూస్తున్నారు. హనుమాన్ విజయంతో గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జా కూడా సూపర్ హీరో, ఫాంటసీ కథలపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం జాంబిరెడ్డి 2తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. పురాణ నేపథ్యం, భారీ దృశ్యాలు, కొత్త తరహా కథనాలతో ఈ యువ హీరోలు తమదైన ముద్ర వేయాలని భావిస్తున్నారు. ఈ సినిమాలన్నీ వచ్చే ఏడాది విడుదలకు సిద్ధమవుతుండటంతో వాటి ఫలితాలపై ఆసక్తి పెరుగుతోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!