

రామాయణం కథను పూర్తిస్థాయిలో సినిమాగా తెరకెక్కించడం ప్రస్తుతం పెద్ద సాహసమని దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి భావించినట్లు తెలుస్తోంది. గతంలో హాలీవుడ్ స్థాయి సాంకేతికతతోనూ పలు రూపాల్లో ఈ ఇతిహాసాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అయినప్పటికీ చాలా చిత్రాలు పెట్టిన పెట్టుబడులను తిరిగి రాబట్టలేకపోయాయి. అందుకే తన వారణాసి సినిమాలో రాముడి పాత్రను పరిమిత ఎపిసోడ్‌కే కేటాయించాలని ఆయన నిర్ణయించుకున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే ప్రేక్షకులు రాముడి మంచితనం, ధర్మబద్ధమైన వ్యక్తిత్వాన్ని ఎన్నో కథల్లో చూశారని రాజమౌళి భావిస్తున్నారట. అయితే ఇప్పుడు ఆయన పరాక్రమాన్ని తెరపై చూడాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారని, ఆ అంశాన్ని రాజమౌళి ప్రత్యేకంగా ఆవిష్కరించనున్నారని సమాచారం. వారణాసిలో రాముడికి సంబంధించిన సన్నివేశాలు అత్యంత ప్రభావవంతంగా ఉండబోతున్నాయని ప్రచారం జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను కదిలించేలా ఆ ఎపిసోడ్లను రూపొందిస్తున్నట్లు సినీ వర్గాల సమాచారం. ఈ ప్రయోగం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!