

యంగ్ హీరో సందీప్ కిషన్ కెరీర్లోనే అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌గా తెరకెక్కనున్న పీరియాడిక్ ఫాంటసీ చిత్రం ‘కరికాల’ ఘనంగా ప్రారంభమైంది. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్ 15, 2026న ఈ సినిమా ముహూర్తపు పూజా కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకలో కథానాయికలు కేథరిన్ థ్రెసా, గాయత్రి భరద్వాజ్, సాక్షి మడోల్కర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నిర్మాత రాజశేఖర్ తల్లి సత్యవతి కెమెరా స్విచ్ ఆన్ చేయగా, మహిధర్ రెడ్డి తల్లి పద్మారెడ్డి క్లాప్ కొట్టారు. హీరో ఆది సాయి కుమార్ గౌరవ దర్శకత్వం వహించగా, నిర్మాత వీరభద్రాచారి చిత్ర బృందానికి స్క్రిప్ట్‌ను అందజేశారు.
ఈ సందర్భంగా సందీప్ కిషన్ మాట్లాడుతూ, తన స్నేహితుడు ఆది సాయి కుమార్ ద్వారా ఈ చిత్ర బృందం పరిచయమైందని, దర్శకుడు యుగంధర్ ముని వివరించిన ‘కరికాల’ ప్రపంచం తనను ఎంతగానో ఆకట్టుకుందని తెలిపారు. ఈ సినిమా తన కెరీర్లోనే అత్యుత్తమ చిత్రంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల అద్భుతమైన ఆల్బమ్ అందిస్తున్నారని పేర్కొన్నారు. మరోవైపు, నాగలోకం, వానర లోకం వంటి అద్భుతమైన ఊహా ప్రపంచాలను ఈ సినిమాలో సృష్టిస్తున్నామని దర్శకుడు యుగంధర్ ముని వెల్లడించారు. వచ్చే వారం నుంచి చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఫాంటసీ, అడ్వెంచర్ అంశాలతో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదటి భాగం 2027 జూలై 2న, రెండో భాగం 2027 అక్టోబర్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!